: కరెంట్ షాక్ తో సినీ కెమెరామన్ మృతి


తెలుగులో పలు చిత్రాలకు కెమెరామన్ గా పనిచేసిన అమర్ శుక్రవారం ఓ భోజ్ పురి చిత్రం షూటింగ్ సందర్భంగా కరెంట్ షాక్ కు గురై మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ లో చిత్రీకరణ జరుపుతుండగా ఈ ఘటన జరిగింది. అమర్ స్వస్థలం నెల్లూరు జిల్లా ముత్తుకూరు కాగా, ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. మోహన్ బాబు హీరోగా నటించిన 'శివశంకర్', శ్రీకాంత్ నటించిన 'ప్రేమసందడి' చిత్రాలు ఆయన కెరీర్లో ప్రముఖమైనవి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాలరెడ్డి వద్ద అమర్ అసిస్టెంట్ కెమెరామన్ గా 25 సినిమాలకు పనిచేశారు. విడుదలకు సిద్ధంగా ఉన్న 'బ్యాండ్ బాజా' చిత్రానికి ఈయనే కెమెరామన్.

  • Loading...

More Telugu News