: 43.13 లక్షలు మాయం.. ఎస్ బీఐ సిబ్బంది చేతివాటం
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం ఎస్ బీఐ బ్రాంచిలో సిబ్బంది చేతివాటం చూపించారు. బ్యాంకులో నిల్వ ఉండాల్సిన 43.13 లక్షల రూపాయలు తక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. క్యాషియర్, అసిస్టెంట్ క్యాషియర్ పై కూసుమంచి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.