: ముగిసిన కేంద్ర హోంశాఖ కీలక సమావేశం.. జలపంపకాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ముగిసింది. దాదాపు నలభై నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా జలవనరుల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్ధిక వనరులు, ఆదాయవ్యయాలు, ఆర్ధికస్థితిపై కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు చర్చించారు.