: హుస్సేన్ సాగర్ నీటిమట్టం మరింత పెరిగే అవకాశం: జీహెచ్ఎంసీ కమిషనర్
హుస్సేన్ సాగర్ లో నీటిమట్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని మేయర్ మాజిద్ హుస్సేన్ తో కలిసి పరిశీలించారు. కాగా, హుస్సేన్ సాగర్ నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ దిగువన ఉన్న కాలనీల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేయర్ మాజిద్ హుస్సేన్ అన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆయన వెల్లడించారు.