: వైఎస్ కుటుంబంపై వీహెచ్ ఫైర్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా కనువిప్పు యాత్ర చేయాలని అనుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు తెలిపారు.
వైఎస్ కుటుంబ సభ్యులు దోచుకున్న ఆస్తి బయటకు తీసుకురావాలని విహెచ్ డిమాండ్ చేశారు. అయితే అవినీతిపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరూ యాత్ర చేయడానికి సిద్ధంగా లేరని ఆయన అన్నారు.
బ్రదర్ అనిల్ కు పది కంపెనీలలో పెట్టుబడులున్నాయని విహెచ్ ఆరోపించారు. ప్రజలను దోచుకున్నదే కాకుండా, కాంగ్రెస్ పార్టీని కించపరిచేలా మాట్లాడుతున్నారని విహెచ్ మండిపడ్డారు. ప్రచారం కోసమే 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం చేపట్టారని విహెచ్ విమర్శించారు.