: దాణా కేసులో బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాకు బెయిల్


సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు రాంచి హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అనారోగ్య కారణాలతో 76 ఏళ్ల మిశ్రా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో, ఆరోగ్య కారణాల రీత్యా కోర్టు రెండు నెలలకు బెయిల్ మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News