: నిర్వహణ భారంతోనే ఆర్టీసీ ఛార్జీలు పెంచాలనుకుంటున్నాం: ఏకే ఖాన్


రాష్ట్రంలో ప్రయాణికులపై ఛార్జీల భారం పడటం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఆర్టీసీలో 20 నుంచి 25 శాతం నిర్వహణ భారం పెరిగిందని, దాంతోనే ఛార్జీలు పెంచాలని భావిస్తున్నామని ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ అన్నారు. డీజిల్ ధర పెంచడంవల్ల ఆర్టీసీపై రూ.900 కోట్ల అదనపు భారం పడిందని వివరించారు. ఐటీ కారిడార్లలో అదనపు బస్సులు నడపాలనుకుంటున్నామని, రాత్రి వేళల్లో కూడా బస్సులు నడుపుతామని చెప్పారు. మహిళల రక్షణ దృష్ట్యా ఆర్టీసీ బస్సులను వినియోగించాలని ఐటీ కంపెనీలకు సూచిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News