: రాష్ట్రవ్యాప్తంగా 4.34 లక్షల ఎకరాల్లో పంట నష్టం
భారీవర్షాల కారణంగా 15 జిల్లాల్లో 4.34 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూధనరావు తెలిపారు. 287 మండలాల్లో 2.75 లక్షల ఎకరాల్లో వరి, 2 లక్షల ఎకరాల్లో పత్తి.. 5,200 ఎకరాల్లో మినుముకు నష్టం కలిగిందని చెప్పారు. దీంతోపాటు, 6 వేల ఎకరాల్లో వేరుశనగ, 5 వేల ఎకరాల్లో మినుము పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు.