: పది రోజుల్లో ఉల్లి ధర దిగొస్తుంది: కేంద్రం


పది రోజుల్లో ఉల్లి ధర తగ్గుముఖం పడుతుందని కేంద్ర ఆహార మంత్రి కేవీ థామస్ చెప్పారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. దేశీయంగా ఉల్లి సరఫరా మెరుగవడం, దిగుమతుల కారణంగా పది రోజుల్లో ధరలు దిగొస్తాయని చెప్పారు. దేశవ్యాప్తంగా కిలో ఉల్లి 70 నుంచి 100 రూపాయల మధ్య పలుకుతోంది. నాఫెడ్ దిగుమతులకు టెండర్లు పిలిచిందని, వచ్చే మూడు నాలుగు రోజుల్లో సరుకు వస్తుందన్నారు. వర్తకులు తగినంత లాభాన్నే చూసుకోవాలిగానీ, వినియోగదారులను దోచుకోరాదని సూచించారు.

  • Loading...

More Telugu News