: సహాయక చర్యలపై సీఎం సమీక్ష
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బొత్స సత్యనారాయణ, పితాని సత్యనారాయణ, పార్థసారథి, వట్టి వసంతకుమార్, డీజీపీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల్లో తాజా పరిస్థితిని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై నివేదిక రూపొందించాలని అధికారులకు సూచించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని వారిని ఆదేశించారు.