: గ్రాండ్ ప్రీలో తమ కారుపై సచిన్ పేరును ప్రదర్శించనున్న ఫోర్స్ ఇండియా
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పై తమకున్న గౌరవాన్ని చాటుతూ... రానున్న గ్రాండ్ ప్రీలో తమ ఎఫ్-1 కార్ల ముందుభాగంలో సచిన్ పేరును ప్రదర్శిస్తామని 'సహారా ఫోర్స్ ఇండియా' తెలిపింది. గొప్ప క్రికెటర్ కు గొప్పగా వీడ్కోలు పలికేందుకు ఇంత కంటే మంచి ప్రత్యామ్నాయం లేదని ప్రకటించింది. అయితే, ఈ గ్రాండ్ ప్రీకి సచిన్ హాజరు కావడం లేదు. ఎందుకంటే, ఆ సమయంలో సచిన్ హర్యానాలో తన చివరి రంజీ మ్యాచ్ ఆడాల్సి ఉంది. తన చివరి టెస్టు మ్యాచ్ కు సన్నాహకంగా సచిన్ రంజీ ఆడాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.