: కటక్ ను ముంచెత్తుతున్న వర్షాలు.. ఐదో వన్డే డౌటే!
ఫైలిన్ తుపాను ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి వెళ్లిపోయింది. వెనువెంటనే వచ్చిన అల్పపీడనం ప్రభావం ఆ రాష్ట్రంపైనా పడింది. దీంతో భారత్, ఆస్ట్రేలియా మధ్య కటక్ లో జరగనున్న ఐదో వన్డే సందేహంలో పడింది. మరో రెండు రోజులపాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లను వర్షాలు వదిలే అవకాశం లేకపోవడంతో ఐదో వన్డే జరుగుతుందా? అనే అనుమానం కలుగుతోంది. వర్షాలతో కటక్ లోని బారబతి స్టేడియం పూర్తిగా తడిసి ముద్దయింది. గ్రౌండ్స్ మెన్ కవర్స్ కప్పి ఉంచినా అవుట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా తయారైంది. పిచ్ బాగున్నప్పటికీ, అవుట్ ఫీల్డ్ లో ఫీల్డింగ్ ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో, ఐదో వన్డేపై నీలినీడలు కమ్ముకున్నాయి.