: భారత ఈవీఎంలపై పాక్ మమకారం
ఎన్నికలలో మనం ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) పై పాకిస్థాన్ ఆసక్తిని కనబరుస్తోంది. రానున్న ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించుకోవాలని పాక్ భావిస్తోంది. దీని కోసం, భారీ ఎత్తున ఈవీఎంలను సరఫరా చేయాల్సిందిగా భారతీయ ఎలక్షన్ కమిషన్ (ఈసీ) కు లేఖ రాసింది. మన ఎలక్షన్ కమిషన్ కూడా ఈవీఎంలకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే భారత్ లోని పాక్ ఎంబసీకి అందజేసింది. అంతే కాకుండా, పాక్ విజ్ఞప్తిని ఈసీ మన విదేశాంగ శాఖకు కూడా తెలియజేసింది.
అయితే, సరిహద్దుల్లో నిరంతరం కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్ కు ఈవీఎంలను సరఫరా చేయడానికి భారత ప్రభుత్వం మొగ్గు చూపడంలేదని సమాచారం. దీనికి తోడు, మన దేశంలోనూ ఎన్నికల హడావుడి మొదలవడంతో పాక్ కు ఈవీఎంలను సరఫరా చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది.