: ప్రకాశం జిల్లాలో 160 బస్సులు రద్దు


ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు జలమయం కావడంతో జిల్లా వ్యాప్తంగా 29 మార్గాల్లో 160 బస్సు సర్వీసులు రద్దయ్యాయి. అద్దంకి ఎన్టీఆర్ నగర్ లో 150 ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. చీరాల, పర్చూరు, చినగంజాం, వేటపాలెం మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు, గుంటూరు జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో, కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు.

  • Loading...

More Telugu News