: సంపన్న భారతీయుల జాబితాలో షారూక్
చెైనాకు చెందిన 'హురూన్ ఇండియా రిచ్ లిస్ట్' రెండో ఏడాది విడుదల చేసిన సంపన్న భారతీయుల జాబితాలోకి బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ చేరాడు. రూ. 2 వేల 500 కోట్ల వ్యక్తిగత ఆస్తులతో షారూక్ తొలిసారి ఈ జాబితాలో చోటు సంపాదించాడు. 'రెడ్ చిల్లీస్' పేరుతో స్థాపించిన సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్న షారూక్ ఈ జాబితాలో 114వ స్థానం దక్కించుకున్నాడు. మొత్తం వందమందితో విడుదల చేసిన ఈ సంపన్న భారతీయుల జాబితాలో ఖాన్ మినహా సినీ నటులు మరెవ్వరూ లేరు.