: సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నవారికి సీట్లివ్వం: రాహుల్
సీబీఐ కేసులెదుర్కొనే వారికి భవిష్యత్ లో సీట్లివ్వబోమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. రాజస్థాన్ లో జరగనున్న ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ నేర చరితులకు కాంగ్రెస్ లో అవకాశం ఉండదని స్పష్టం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి కిరణ్ తో గీతారెడ్డి, సబిత ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు జరిగితే సీబీఐ అభియోగాలు ఎదుర్కొంటున్న గీతారెడ్డి, సబిత, ధర్మానలు కాంగ్రెస్ పార్టీకి దూరం కావాల్సి వస్తుంది.