: తమిళనాడుకు విచ్చేస్తున్న 'విదేశీ అతిథులు'
తమిళనాడులోని పలు ప్రాంతాలకు విదేశీ పక్షుల రాక మొదలైంది. అంతియూర్ అడవులలో ఉన్న వరత్తుపల్లమ్ రిజర్వాయర్ సమీపంలో ఆస్ట్రేలియన్ పెలికాన్ పక్షులు వందల సంఖ్యలో దర్శనమిచ్చాయి. గెట్టిసముద్రన్ ఏరి రిజర్వాయర్ వద్ద కూడా పక్షులు సందడి చేస్తున్నాయి. ఈరోడ్ కు 15 కిలోమీటర్ల దూరంలోని వెల్లోడ్ పక్షి సంరక్షణ కేంద్రానికి కూడా పెలికాన్ పక్షుల రాక మొదలైంది. ఏటా వేల సంఖ్యలో విదేశీ పక్షులు ఇక్కడకు వచ్చి గుడ్లు పెట్టి పిల్లలయ్యాక తిరిగి డిసెంబర్ నెలలో తమ దేశాలకు ప్రయాణమవుతాయి.