: అశోక్ బాబు వ్యవహారంపై గవర్నర్ ను కలిసిన వీహెచ్
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వ్యవహారంపై ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ ను కలిసినట్లు రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏ పార్టీకి ఓటేయాలో ప్రజలకు అశోక్ బాబు చెప్పడం సరికాదన్నారు. కాగా, అశోక్ బాబుపై గవర్నర్ కు వీహెచ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.