: మరో 24 గంటల పాటు కుండపోతే


మన రాష్ట్రానికి మరో 24 గంటల పాటు జలగండం పొంచి ఉంది. రానున్న 24 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయని తెలిపింది. దీనికి తోడు రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీర ప్రాంతంలో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

  • Loading...

More Telugu News