: ఇక క్షణాల్లో సెల్‌ఫోను చార్జింగ్
ఇక మనం సెల్‌ఫోను చార్జింగ్ కోసం గంటతరబడి వెయిట్ చేయక్కర్లేదు. ఆ పని క్షణాల్లోనే తెమిలిపోతుంది. ఇలాంటి సరికొత్త కెపాసిటర్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కెపాసిటర్‌తో సెల్‌ఫోన్లు క్షణాల్లో రీఛార్జి కావడమేకాదు వారాలపాటు పనిచేసేందుకు కూడా తోడ్పడేలా శాస్త్రవేత్తలు ఈ కొత్త సూపర్ కెపాసిటర్‌ను తయారుచేశారు.
వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన మెటీరియల్ శాస్త్రవేత్త సిలికాన్ పదార్ధంతో ఈ సూపర్ కెపాసిటర్‌ను తయారుచేశారు. దీన్ని మైక్రోఎలక్ట్రానిక్ సర్య్కూటరీ వ్యవస్థతో కూడిన సిలికాన్ చిప్‌లా రూపొందించవచ్చు. దీనివల్ల సోలార్ సెల్స్, సెన్సర్లు, మొబైల్ ఫోన్లు, వివిధ రకాల ఎలక్ట్రో మెకానికల్ పరికరాలను తక్కువ వ్యయంతో పనిచేయించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. సిలికాన్‌తో సూపర్ కెపాసిటర్‌ను తయారుచేయడాన్ని మరికొంతమంది నిపుణులు కొట్టిపారేస్తున్నారనీ, అయితే తాము ఇందుకోసం తేలికైన మార్గాన్ని రూపొందించామని పరిశోధకులు కారీ పింట్ చెబుతున్నారు.