: షుగరు రోగులకు శుభవార్త
షుగరు వ్యాధిగ్రస్తులకు ఒక శుభవార్త. వారు ఇన్సులిన్ తీసుకునేందుకు అతిచిన్న సూదిని పరిశోధకులు తయారుచేశారు. బెక్టన్, డికిన్సన్ అండ్ కంపెనీ (బీడీ గ్లైడ్) వారు ఇన్సులిన్ తీసుకునేందుకు ఉపయోగపడే అతి చిన్న సూదిని తయారుచేశారు. ఈ సూదిని హైదరాబాద్‌లోని ఓసీస్ ప్లాజా ఏపీఐ ఆడిటోరియంలో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మధుమేహ వ్యాధి నిపుణులు డాక్టర్ రాకేశ్‌నహాయ్ ఆవిష్కరించారు. ఈ సూదిని గురించి ఆయన మాట్లాడుతూ ఇది దేశంలోనే అత్యంత చిన్న ఇన్సులిన్ సూది అని, ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సూదికంటే 25 శాతం చిన్నదని తెలిపారు.