: డాల్ఫిన్‌ ప్రేరణతో తయారైన కొత్త రాడార్‌


డాల్ఫిన్‌ చేపల ప్రేరణతో సరికొత్త రకం రాడార్‌ వ్యవస్థను పరిశోధకులు తయారుచేశారు. ఈ రాడార్‌ వ్యవస్థ కనిపించకుండా ఉండే పేలుడు పదార్ధాలను, నిఘా పరికరాలను గుర్తించగలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సౌతాంప్టన్‌కు చెందిన పరిశోధకులు, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌, కోభామ్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ సహకారంతో ట్విన్‌ ఇన్వెర్టెడ్‌ పల్స్‌ రాడార్‌ (టీడబ్ల్యూఐపీఆర్‌)ను రూపొందించారు. డాల్ఫిన్లు తమ లక్ష్యాలను నిర్దిష్టంగా నిర్ధారించుకునేందుకు బుడగల వలలను ఉపయోగించుకునే తరహాలో ఈ రాడార్‌ పనిచేస్తుంది.

పేలుడు పరికరాల్లో ఉపయోగించే కొన్ని రకాల ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్లకు ఇతరత్రా వస్తువులకు మధ్య తేడాను ఇది గుర్తిస్తుంది. ఇలాంటి విషయాల్లో సంప్రదాయ రాడార్లు, మెటల్‌ డిటెక్టర్లు చేసే పొరబాట్లకు ఈ రాడార్‌ తావీయదు. ట్విన్‌ ఇన్వెర్టెడ్‌ పల్స్‌ సోనార్‌ (టీడబ్ల్యూఐపీఎస్‌) అనే ప్రత్యేకమైన సోనార్‌ భావనల ఆధారంగా ఈ రాడార్‌ వ్యవస్థను పరిశోధకులు టిమ్‌ లెయిగ్టన్‌ రూ రూపొందించారు.

  • Loading...

More Telugu News