: చట్టానికి నేను అతీతుడిని కాదు: మన్మోహన్ సింగ్
తాను చట్టానికి అతీతుడిని కాదని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించి దాచేందుకు ఏమీ లేదన్నారు. విద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన విపక్షాలకు పిలుపునిచ్చారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల విషయంలో తనను సీబీఐ ప్రశ్నించొచ్చని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడం విచారకరమని ఆయన అన్నారు.