: చాటింగే 'అభయ కొంప' ముంచిందా..?
ఛాటింగ్ హాబీ యువతరం కొంప ముంచుతోంది. 24 గంటలూ ఛాటింగ్ లో మునిగి తేలుతున్న యువతరం తమ ముందు ఏం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. అదే వారి పాలిట శాపంగా మారుతోందా? అంటే, అవుననే అనిపిస్తోంది. తాజాగా అభయ ఘటనలో ఆమె భద్రతను ప్రశ్నార్థకం చేసిన పాపం ఛాటింగ్ కు కూడా ఉంది. భాగ్యనగర వాసులను ఉలిక్కిపడేలా చేసిన ఘటనలో అభయ ఏమరపాటుగా ఉండడం కూడా ఆమె పాలిట శాపంగా మారింది. ఇనార్బిట్ మాల్ లో షాపింగ్ చేసుకుని వచ్చిన అభయ, క్యాబ్ ను పిలిచి బెంగుళూరులో ఉన్న తన స్నేహితుడితో ఛాటింగ్ లో మునిగిపోయింది.
ఇంటికి వెళ్ళాలంటూ అడ్రెస్ చెప్పిన తరువాత ఛాటింగ్ లో మునిగిపోయిన అభయ .. తానెక్కిన వాహనం ఎక్కడికి వెళుతుందో గమనించలేదు. దీంతో, కామాంధులు తామేం చేయాలనుకున్నారో అందులో సగం విజయం సాధించారు. వారి ఆలోచనను గమనించిన అభయ తన మిత్రుడికి విషయం చెప్పేసరికే సమయం మించిపోయింది. ఆమె సెల్ లాక్కున్న దుండగులు నిర్మానుష్యప్రాంతానికి కారును తీసుకెళ్లి ఆమెపై అరాచాకానికి పాల్పడ్డారు. యువతరానికి అభయ ఘటన కనువిప్పు కలిగించాలని విజ్ఞులు కోరుతున్నారు.