: పాక్ లో హిందూ మహిళ దుస్తుల్ని చింపిన దుండగుడు


దీపావళి పండుగకు తన తల్లి దగ్గరకు వచ్చిన 30 ఏళ్ల హిందూ మహిళ... ఆభరణాలు కొనుక్కోవడానికి తల్లితో పాటు బజారుకు వెళ్లింది. వీళ్లను అనుసరించిన ఓ దుండగుడు ఆమె జుట్టు పట్టుకుని లాగి... ఆమె దుస్తులను కొంత మేర చింపేశాడు. అక్కడున్న వాళ్ళు తొలుత దిగ్భ్రాంతి చెందినా.. వెంటనే తేరుకుని ఆమెను రక్షించారు. కప్పుకోవడానికి దుస్తులిచ్చారు. హిందూ వివాహిత మహిళపై దాడి చేసిన వ్యక్తి అక్కడున్న వాళ్లందరినీ తిట్టుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలో ఉన్న ఉమర్ కోట్ జిల్లాలో జరిగింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆగంతకుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కోర్టు పాకిస్థాన్ చట్టాల ప్రకారం మహిళపై దాడికి సంబంధించిన సెక్షన్ల కింద... ముద్దాయిని మూడు రోజుల పాటు రిమాండుకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దారుణ ఘటనను పాకిస్థాన్ లోని అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ఖండించాయి.

  • Loading...

More Telugu News