: నవంబర్ 14 నుంచి బాలల చలనచిత్రోత్సవం: డీకే అరుణ
18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం హైదరాబాదులో నిర్వహించనున్నట్టు మంత్రి డీకే అరుణ తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, చిత్రోత్సవంలో భాగంగా నవంబరు 14 నుంచి 20 వరకు 18 విభాగాల్లో బాలల చలన చిత్రాల పోటీలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 2011 తరువాత నిర్మించిన చిత్రాలు బాలల చలన చిత్రోత్సవంలో పోటీ పడతాయని ఆమె అన్నారు.