: ఢిల్లీ వెళ్ళేందుకు విజయసాయికి అనుమతి
ఆడిటర్ విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్ళేందుకు నాంపల్లి సీబీఐ న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన ఇటీవలే షరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యారు. అనంతరం, ఢిల్లీ వెళ్ళేందుకు అనుమతించాలంటూ కోర్టులో మెమో దాఖలు చేశారు. దానిపై నేడు విచారించిన న్యాయస్థానం వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆయన ఢిల్లీ వెళ్ళిరావచ్చని పేర్కొంది. విజయసాయిపై ఈడీ విచారణ కొనసాగుతున్నందున ఆయన తరచూ ఢిల్లీ వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే, ఆయన కోర్టును అనుమతి కోరారు.