: ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి కోరనున్న జగన్
భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాల్లో ఈ నెల 27, 28 తేదీల్లో పర్యటించేందుకు గాను వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోర్టు అనుమతి కోరనున్నారు. అక్రమాస్తుల కేసులో ఆయన ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్ పై బయట ఉన్నారు. జగన్ కు న్యాయస్థానం అనుమతి ఇవ్వకపోతే, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ముంపు బాధితులను పరామర్శిస్తారని పార్టీ నేత కొణతాల రామకృష్ణ తెలిపారు. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా సమైక్య శంఖారావం సభ నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నా.. జగన్ పిలుపునిచ్చిన మేరకు ఈ నెల 26న సభ ఉంటుందని కొణతాల స్పష్టం చేశారు.