: తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకే జగన్ సభ: కొండా సురేఖ


జగన్ పై కొండా సురేఖ మండిపడుతున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, సమైక్య శంఖారావం పేరిట హైదరాబాదులో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న బహిరంగ సభ తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేందుకేనని అన్నారు. దీనికి తెలంగాణ ప్రజలు రెచ్చిపోరని, వారి కల నెరవేరే సమయంలో ఇలాంటివి వారు పట్టించుకోరని అన్నారు. సోనియా నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ చురుగ్గా సాగుతోందన్నారు. సీఎం కిరణ్ వ్యక్తిగతంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని సురేఖ అన్నారు. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు పడుతున్న వేదన కొన్నేళ్లుగా తెలంగాణ ప్రజలు అనుభవించారని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News