: చిదంబరంతో భేటీ అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ అయ్యారు. ఈ నెలాఖరున ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించాల్సి ఉన్న నేపథ్యంలో వీరిరువురి సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాజన్... దేశ ఆర్థిక పరిస్థితితో పాటు పలు విషయాలపై మంత్రితో చర్చించినట్టు తెలిపారు.