: రాహుల్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నిరాశావహ స్థితికి నిదర్శనం: బీజేపీ
'మా నాయనమ్మ, నాన్నలా నన్నూ చంపేస్తారేమో' అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నిరాశావహ స్థితిని తెలియజేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. నరేంద్ర మోడీకి పెరుగుతున్న ప్రాచుర్యాన్ని, ఆదరణను కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. గతించిన విషయాలను ప్రస్తావించి సానుభూతి పొందే ప్రయత్నాన్ని రాహుల్ చేశాడని పేర్కొన్నారు. వైఫల్యాలకు వారివద్ద సమాధానం లేదంటూ ఎద్దేవా చేశారు. నిన్న రాజస్థాన్ లోని చురులో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ బీజేపీ మత రాజకీయాలను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని, కుల, మత, వర్గ విద్వేషాల వల్లే నాయనమ్మ ఇందిరను, నాన్న రాజీవ్ ను హత్య చేశారని, ఈ క్రమంలో తననూ హత్య చేస్తారేమో.. అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఒకవేళ అలా చావాల్సి వచ్చినా తాను భయపడబోనని అన్నారు.