: గుంటూరులో పాఠశాలలకు సెలవ్
కోస్తాంధ్రలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భారీ వర్షాలతో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. గత 76 గంటలుగా కురుస్తున్న వర్షాలకు గుంటూరు జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో విద్యార్థుల రాకపోకల ఇబ్బందుల నేపథ్యంలోనూ, స్కూలు భవనాల పటిష్ఠతపై అనుమానాలతోనూ అధికారులు సెలవు ప్రకటించారు.