: జగన్ సభను వాయిదా వేసుకోవాలి: కేటీఆర్
ఈనెల 26న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన 'సమైఖ్య శంఖారావం' సభను వాయిదా వేసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు కోరారు. రాష్ట్రంలో రైతులు భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో సభ ఎందుకు? అన్నారు. దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల సమయంలో తాము ఉద్యమాన్ని వాయిదా వేశామని గుర్తు చేశారు. మానవతా దృక్పథంతో సభను వాయిదా వేసుకోవాలన్నారు. కాగా, ఆర్టికల్ 371-డి తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా చెప్పారు.