: హైదరాబాదులో గోడ కూలి ముగ్గురి మృతి


హైదరాబాదులో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముగ్గురు మరణించారు. మాసబ్ ట్యాంక్ లోని విద్యానగర్ కోటమ్మ బస్తీలో బీఈడీ కళాశాల గోడకూలి పక్కనే ఉన్న ఇంటిపై పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. చనిపోయిన వారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన పార్వతి(45), లక్ష్మి(25), జనార్ధన్(5)గా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేశారు. అటు, బాధితులను నగర మేయర్ మాజిద్ హుస్సేన్, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పరామర్శించారు.

  • Loading...

More Telugu News