: మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నప్పుడు విభజనకు రాజ్యాంగం ఒప్పుకుంటుందా?: ఉండవల్లి
రాష్ట్ర విభజన అంశం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది కాదని... ఇది యావత్ దేశానికి సంబంధించిన సమస్య అని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మెజారిటీ సభ్యులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నప్పుడు... విడగొట్టడానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా? అని సూటిగా ప్రశ్నించారు. రాజమండ్రిలో ఉండవల్లి ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతివాళ్లూ తమకు తోచిన రీతిలో వారికి అనుకూలమైన ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. చాలామందికి ఏం జరగబోతోంది అన్న దానిపై క్లారిటీ కూడా లేదన్నారు.