: ధోని ఇంటిపై రాళ్లతో దాడి


గుర్తు తెలియని దుండగులు జార్ఖండ్ రాజధాని రాంచీలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంటిపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. రాంచీలో భారత్, ఆసీస్ జట్ల మధ్య నిన్న మ్యాచ్ సందర్భంగా ఇది జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. స్టేడియం నుంచి ధోని కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా రాళ్ల దాడి జరిగినట్లు గుర్తించారు. అయితే, దీనిపై ధోనీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఇంతవరకు ఫిర్యాదు చేయలేదు. ఇంటి ముందు భాగంలో ఉన్న సీసీటీవీ కెమేరా ఫుటేజీలను పరిశీలించిన తర్వాత వారు నిర్ణయం తీసుకోనున్నారు. ధోనీ ఇంటిపై రాళ్ల దాడి ఇది ఐదోసారి

  • Loading...

More Telugu News