: వదినపై కామపిశాచి కన్ను.. కాదన్నందుకు హత్య
కన్నతల్లి తర్వాత తల్లిగా వదినను చెబుతారు. కానీ, కామంతో మధమెక్కిన ఒకడు వదినపై అత్యాచారానికి తెగించాడు. అంతటితో ఆగలేదు. ఆ పాపకార్యానికి ఒప్పుకోలేదని ఆమెను హత్యచేసి తాను మనిషిని కాదని, వావి వరసలు తెలియని పశువునని నిరూపించుకున్నాడు.
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో ఈ ఘోరం జరిగింది. నారాయణఖేడ్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన రమేష్, సుజాత(27) పెద్ద శంకరంపేటలో నివసిస్తూ రోళ్ల తయారీతో జీవనం సాగిస్తున్నారు. అన్న రమేష్ స్వగ్రామానికి వెళ్లడంతో పెద్దనాన్న కుమారుడైన చందర్ మంగళవారం అర్ధరాత్రి వదినపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె అడ్డుకోవడంతో హత్యచేసి పరారయ్యాడు.