: పాలపుంతలో చిన్న అలజడి
మనం నివసించే సౌరకుటుంబాన్ని కలిగివుండి సర్పిలాకారంలో ఉండే పాలపుంత ఒక కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ చలనం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడూ చలిస్తూ ఉండే పాలపుంతలో స్వల్పమైన అస్ధిర కదలికలు కూడా చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం జరిపిన ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు మన సూర్యుడి దరిదాపుల్లో ఉన్న దాదాపు ఐదు లక్షల నక్షత్రాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించారు. పాలపుంతలో సహజంగా సాగే చలనంతోబాటు అదనంగా పాలపుంత నక్షత్రమండలం క్షేత్రానికి 90 డిగ్రీల కోణంలో స్వల్పంగా కదులుతోందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. పాలపుంత అస్థిర చలనాల గురించి తెలిసిందిగానీ దాని వెనకున్న కారణాలేమిటి అనే విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించలేకున్నారు. ఈ విషయాన్ని గుర్తించే విషయంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.