: వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ: జయప్రద


వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచీ పోటీ చేస్తానని పాతతరం నటీమణి, మాజీ ఎంపీ జయప్రద చెప్పారు. అయితే ఏ పార్టీ తరఫున పోటీ చేసేదీ ఆమె వెల్లడించలేదు. తాను సమైక్యాంధ్రనే కోరుకుంటున్నానని చెప్పారు. తెలుగు చిత్ర రంగంలో తెలుగు హీరోయిన్లు లేరని అన్నారు. 

జయప్రద గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ఆ తర్వాత పార్టీకి దూరమైన సంగతి తెలిసిందే. అనంతరం ములాయంసింగ్ ఆధ్వర్యంలోని సమాజ్ వాదీ పార్టీలో చేరి, ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 2010లో అమర్ సింగ్ ను సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కరించడంతో జయప్రద కూడా ఆ పార్టీకి దూరమయ్యారు. తిరిగి రాష్ట్ర రాజకీయాలలోకి రావాలని అనుకుంటున్నానని జయప్రద కొన్ని నెలల క్రితమే చెప్పారు. ఇక ఆమె ఏ పార్టీ నుంచి మలి పయనం ప్రారంభిస్తారో చూడాలి. 

  • Loading...

More Telugu News