: హైదరాబాదులో భారీ వర్షం.. ట్రాఫిక్ కు అంతరాయం
హైదరాబాద్ వర్షంలో తడిసి ముద్దయింది. నగరంలో పలు చోట్ల మధ్యాహ్నం నుంచే వర్షం మొదలైంది. అబిడ్స్, నాంపల్లి, కోఠి, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, మలక్ పేట, చంచల్ గూడ, మాదన్నపేట, సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ లో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల రోడ్లపై రెండడుగుల మేర వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో, పలు కూడళ్లలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉప్పల్ లో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.