: ఉత్తమ బహుళజాతి సంస్థగా 'గూగుల్'కు అగ్రస్థానం


పనిచేయడానికి అనువుగా ఉండే ఉత్తమ బహుళజాతి కంపెనీల జాబితాలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ అగ్రస్థానం దక్కించుకుంది. సాఫ్ట్ వేర్ డెవలపర్ 'సాస్ ఇన్స్టిట్యూట్', నెట్ వర్క్ స్టోరేజ్ ప్రొవైడర్ 'నెట్ ఆప్' రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నాలుగో ర్యాంకులో నిలిచింది. పని చేయడానికి సకల సౌకర్యాలతో అద్భుతంగా అనిపించే 25 బహుళజాతి కంపెనీల జాబితాను ఓ హ్యూమన్ రిసోర్స్ కన్సల్టెన్సీ రూపొందించింది. వీటిలో భారతదేశానికి చెందిన ఒక్క కంపెనీ కూడా లేకపోగా, జాబితాలో ఉన్న ఈ 25 కంపెనీలు అమెరికా, ఐరోపాలకు చెందినవే కావడం విశేషం. టాప్ టెన్ లో తొమ్మిది కంపెనీలు అమెరికాకు చెందినవే ఉన్నాయి. 45 దేశాలకు చెందిన 6 వేలకు పైగా కంపెనీల స్థితిగతులు పరిశీలించి ఈ జాబితా రూపొందించామని కన్సల్టెన్సీ పేర్కొంది.

  • Loading...

More Telugu News