: భారత్ టార్గెట్ 296
మరోసారి భారత్ ముందు భారీ లక్ష్యం నిలిచింది. రాంచీ వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 295 పరుగులు చేసింది. ఆసీస్ జట్టులో కెప్టెన్ బెయిలీ 98, మ్యాక్స్ వెల్ 92 పరుగులతో రాణించారు. చివర్లో జాన్సన్ (25), ఫాక్నర్ (23 నాటౌట్ ) విలువైన పరుగులు జోడించారు. భారత బౌలర్లలో షమి 3 వికెట్లతో ఆకట్టుకోగా.. వినయ్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు.