: సంజయ్ దత్ శిక్ష కుదింపుపై మహారాష్ట్ర అభిప్రాయాన్ని కోరిన కేంద్రం


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జైలు శిక్ష తగ్గింపుపై కేంద్ర హోంశాఖ మహారాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. 1993 ముంబయి పేలుళ్ల కేసులో సంజయ్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూకు విధించిన శిక్షను మానవతా దృక్పథంతో తగ్గించాలంటూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ ఖట్జూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖ రాశారు. ఇదే సమయంలో, మరో ముగ్గురి శిక్షను కూడా తగ్గించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ మహారాష్ట్ర సర్కారు స్పందనను కోరింది.

  • Loading...

More Telugu News