: స్మగ్లింగ్ ఆరోపణలతో ఇద్దరు ఎయిరిండియా ఉద్యోగుల సస్పెన్షన్


గంధపు చెక్కల స్మగ్లింగ్ ఆరోపణలతో ఇద్దరు ఎయిరిండియా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. వెంటనే ఈ వ్యవహారంలో దర్యాప్తు జరపాలని ఎయిరిండియా అధికారులను ఆదేశించింది. ఆదివారం నాడు ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మిలింద్ దావనే, నిధిన్ కోరా అనే ఇద్దరు ఫ్లయిట్ అటెండెంట్లను ఇంటలిజెన్స్ వింగ్ అరెస్టు చేసింది. వారు 56 కేజీల గంధపు చెక్కలను హాంకాంగ్ తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మూడు రోజుల కిందట (ఆదివారం)తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడిందని ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ వ్యవహారంలో నేరం నిరూపణ అయితే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఎయిరిండియా అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News