: మహిళపై హత్యాయత్నం
ఓ మహిళపై హైదరాబాద్ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగింది. ఖైరతాబాద్ లోని ఆనంద్ నగర్ రేణుకా అపార్ట్ మెంట్స్ లో నివాసముంటున్న సవిత(35) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆమె మధ్యాహ్న భోజనానికి ఇంటికి చేరుకోగా.. ఇంతలో ఓ వ్యక్తి తలుపు తట్టి, 'రామకృష్ణ ఉన్నారా?' అని అడిగాడు. లేరంటూ తలుపు మూయబోతుండగా కత్తితో పొడిచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను స్థానికులు పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ఇంటి తలుపు మీదున్న నేమ్ ప్లేట్ ఆధారంగా రామకృష్ణ పేరుతో పిలిచి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.