: సఫారీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన పాక్


దక్షిణాఫ్రికాతో తటస్థ వేదికపై జరుగుతున్న రెండో క్రికెట్ టెస్టులో పాకిస్థాన్ జట్టు తన పాత నైజాన్ని చాటుకుంది. ఎప్పుడెలా ఆడుతుందో తెలియని రీతిలో నేడు 99 పరుగులకే కుప్పకూలింది. దుబాయ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టుకు సఫారీ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, పేసర్ డేల్ స్టెయిన్ చుక్కలు చూపారు. తాహిర్ 5, స్టెయిన్ 3 వికెట్లతో పాక్ వెన్ను విరిచారు. దీంతో, ఆ జట్టు లంచ్ విరామం తర్వాత తొలి ఇన్నింగ్స్ ముగించింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (7 బ్యాటింగ్), అల్విరో పీటర్సన్ (25 బ్యాటింగ్)క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News