: 'హైదరాబాద్ ఓ మినీ భారత్' అంటున్న మాజీ సీఎం
'హైదరాబాదు నగరం ఓ మినీ భారత్' అని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అభివర్ణించారు. ఇటీవలే పాక్ సైన్యం సరిహద్దుల్లో జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన హైదరాబాద్ జవాన్ ఫిరోజ్ ఖాన్ సంతాప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేషనల్ సాలిడారిటీ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదు గాంధీభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 'హైదరాబాదులో భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు మనుగడ సాగిస్తున్నారు. అందుకే, ఇది మినీ భారత్' అని పేర్కొన్నారు. ఇక, ఫిరోజ్ ఖాన్ దేశం కోసం ప్రాణాలు అర్పించాడని, అతనో గొప్పవీరుడని కీర్తించారు.