: మావోయిస్టులు పెట్టిన మందుపాతర్లను వెలికి తీసిన పోలీసులు
ఒడిశాలోని కోరాపుట్-లక్ష్మీపూర్ రహదారిలో రెండు మందుపాతర్లను వెలికి తీసినట్టు కోరాపుట్ ఎస్పీ తెలిపారు. ఈ రెండు మందుపాతర్లూ అత్యంత శక్తిమంతమైనవని చెప్పారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులను కట్టడి చేసేందుకు భద్రతా దళాలు, పోలీసులు చురుగ్గా వ్యవహరిస్తున్నారని... వారిని లక్ష్యంగా చేసుకునే మావోయిస్టులు వీటిని అమర్చారని తెలిపారు. కోరాపుట్-లక్ష్మీపూర్ రహదారిని వెడల్పు చేస్తున్న కార్మికులు వీటిని కనుగొన్నారని ఎస్పీ వెల్లడించారు. వీటిని బకెట్లలో ఉంచారని... అయితే, వీటికి కరెంట్ వైర్లను కనెక్ట్ చేయలేదని తెలిపారు. ఈ ఉదంతంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ రహదారిపై మరిన్ని మందుపాతరలు ఉండే అవకాశం ఉందని... రహదారికి ఇరువైపులా ముమ్మర తనిఖీలు చేపట్టారు.