: బంగారం కథలను చిన్నప్పటి నుంచీ వింటోందట!
సాధువు స్వప్నం ఆధారంగా ఉత్తరప్రదేశ్ లోని దాండియాఖేరాలో బంగారం కోసం తవ్వకాలు జరుపుతుంటే. 57 ఏళ్ళ స్థానిక మహిళ, రాజా రాంభక్ష్ మునిమనవడికి వారసురాలిగా చెప్పుకుంటున్న రేఖాసింగ్ మాత్రం బంగారం దొరకడానికి చాలా పరిమిత అవకాశాలే ఉన్నాయంటోంది. ఇక్కడ బంగారం ఉందనే కథలను తన చిన్నప్పటి నుంచి వింటున్నానని పేర్కొంది. గత కొన్ని దశాబ్దాలలో పలుసార్లు కోటలో తవ్వకాలు జరిగాయని తెలిపింది. అందరూ భావిస్తున్నట్లు కోటలో బంగారు ఖజానా లేదని ఆమె చెబుతోంది.