: ఎంపీగా పోటీచేయాలనుంది: జేసీ


కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆరుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన తనకు ఈసారి ఎంపీగా పోటీ చేయాలనుందని తెలిపారు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని ఇప్పుడే చెప్పలేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని ఆయన ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు, జేసీ ఫ్యామిలీ రానున్న రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకోనుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News